రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును యూఎస్ లిటిల్ జాయింట్ ల్యాడర్ సిస్టమ్స్ కంపెనీ ప్రతినిధులు కలిశారు. హైదరాబాద్ లో 311 కోట్లతో కంపెనీని ఏర్పాటు చేస్తామని వారు ఈ సందర్భంగా తెలుపగా దానికి కేటీఆర్ సానుకూలంగా స్పందించి పెట్టుబడులు పెట్టేందుకు ఆ కంపెనీని ఆహ్వానించారు. కేటీఆర్ మాట్లాడుతూ సాఫ్ట్ వేర్, బయోకెమిస్ట్రీ రంగాలతో పాటు మౌళిక రంగంలో కూడా పెట్టుబడులు హైదరాబాద్ కు వస్తున్నాయని చెప్పారు.
రాష్ట్రానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధాని మోడీని ఆహ్వానిస్తామని, రాష్ట్ర సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని, కేంద్రప్రభుత్వంతో స్నేహపూర్వక సంబంధాలే కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పెట్టుబడులు, ఉపాధి కల్పనపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని కూడా తెలిపారు.