సీమాంధ్రలో తెలంగాణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళల్లో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.
కర్నూల్ జిల్లా జూపాడు బంగ్లా సమీపంలోని మండ్లెం గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రాధమిక పాఠశాల విద్యార్ధులను అక్కడ పనిచేసే ఉపాద్యాయులు సమైక్యాంధ్ర ర్యాలీకి తీసుకువెళ్లారు. అనంతరం రహదారి మీద ఒక టైరువేసి దానికి నిప్పంటించి రాస్తారోకో చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పిల్లలందరూ టైరు చుట్టు గుమికూడి ఉన్నప్పుడు ఒక వ్యక్తి టైరు మీద పెట్రోల్ పోయగా, వెనుక నుండి మరో వ్యక్తి అగ్గిపుల్ల గీసి టైరు మీద వేశాడు. అకస్మాత్తుగా మంటలు ఎగియడంతో ఇద్దరు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు.
ఆరవ తరగతి చదువుతున్న డేవిడ్, నాలుగో తరగతి చదువుతున్న జార్జి ఒంటికి కాలిన గాయాలు కావడంతో స్థానికులు వారిని హుటాహుటిన నందికొట్కూరు లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స జరిపిస్తున్నారు. గాయపడ్డ ఇద్దరు చిన్నారులు కూడా దళితులే కావడం గమనార్హం
సీమాంధ్ర ఆందోళనల్లొ స్కూలు పిల్లలను పావులుగా వాడుకోవడం సర్వసాధారణంగా మారింది. విభజన అనివార్యమని తెలిసి కూడా నాయకుల స్వార్ధం కొరకు అభం శుభం ఎరుగని చిన్నారుల ప్రాణాలు ఫణంగా పెట్టడం దారుణం.