సీమాంధ్రలో “సమైక్యాంధ్ర” పేరిట రెచ్చిపోతున్న ఉన్మాద మూకలు ఇవ్వాళ మరో దారుణానికి ఒడికట్టాయి. ఒంగోలు డీ.ఈ.ఓ గా పనిచేస్తున్న రాజేశ్వర రావు అనే అధికారి ఇంటిపై ఇవ్వాళ సమైక్య మూకలు దాడి చేశాయి. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు.
అల్లరిమూకలు ఆయన ఇంటి తాళాలు పగులగొట్టి సామాన్లు అన్నీ చిందరవందరగా విసిరేశారు. నల్లా పైపులు పగులగొట్టారు.
ఈ దాడి సంగతి తెలుసుకున్న తెలంగాణ ఎన్.జీ.ఓ నేతలు దేవీప్రసాద్, విఠల్, రవీందర్ రెడ్డి సీమాంధ్ర ఆందోళనలపై తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. పైకి సమైక్యత అంటూ తెలంగాణ ప్రజలపై దాడులు చేయడం హేయమని వారు అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనల అసలు లక్ష్యం ఏమిటని వారు ప్రశ్నించారు.
మరోసారి తెలంగాణ ప్రజలపై దాడులు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఉద్యోగసంఘాల నేతలు హెచ్చరించారు.
గత వారం రోజులుగా సీమాంధ్రలో అనేక చోట్ల తెలంగాణ ఉద్యోగులపై, ప్రజలపై దాడుల పరంపర కొనసాగుతోంది.