పునర్విభజన చట్టం ప్రకారమే నిర్ణయాలు ఉండాలి : తెలంగాణ

  • January 12, 2022 5:25 pm

విభజన అంశాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నిర్వహించిన వర్చువల్ సమావేశం ముగిసింది. బుధవారం ఉదయం జరిగిన ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఆర్థిక, విద్యుత్, పౌరసరఫరాలు, సింగరేణి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల అధికారులు చెప్పిన పలు విషయాలను హోంశాఖ కార్యదర్శి విన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 మేరకే నిర్ణయాలు ఉండాలని తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. 9వ షెడ్యూల్లో ఉన్న 32 సంస్థలపై గతంలో వినిపించిన వాదననే ఏపి ప్రభుత్వం మళ్ళీ వినిపించింది. ఆస్తులు, అప్పుల పంపకంపై విభజన చట్టంలోని 51, 52, 56 సెక్షన్లకు సవరణ చేయాలని ఏపి కోరింది.


Connect with us

Videos

MORE