mt_logo

తెలంగాణలో భారీగా తగ్గిన నిరుద్యోగ రేటు

తెలంగాణాలో నిరుద్యోగం భారీగా తగ్గుతోంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వెల్లడించిన నివేదికలో గత ఏడు సంవత్సరాలతో పోలిస్తే గణనీయంగా నిరుద్యోగం తగ్గింది. జాతీయసగటు కంటే తెలంగాణలో నిరుద్యోగరేటు తక్కువగా ఉండటం మరొక విశేషం. ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి తెలంగాణలో 4.2 శాతంగా నిరుద్యోగరేటు నమోదైంది. కాగా హర్యానాలో అత్యధికంగా 30.7 శాతంగా ఉండగా.. రాజస్థాన్ 29.6 శాతం, జమ్మూ&కాశ్మీర్ లో 22.2 శాతం ఉంది. ఇక జాతీయ సగటు 7.75 శాతం ఉండగా తెలంగాణలో 4.2 శాతం మాత్రమే నమోదైంది. గత మే నెలలో తెలంగాణాలో 7.2 శాతం నిరుద్యోగం నమోదు కాగా ఐదు నెలల్లోనే నిరుద్యోగ రేటు విపరీతంగా తగ్గటం.. తెలంగాణ ప్రభుత్వం యొక్క చిత్తశుద్దికి నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కంటే రాష్ట్రం ఏర్పడ్డాక పరిస్థితిలో చాలా మార్పు వచ్చిందని నిపుణులు చెబుతుండగా.. మంత్రి కేటీఆర్ అవిరామ కృషి వల్ల తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తడంతో యువతకు వేలకొద్దీ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *