నిన్న సాయంత్రం నుండి రాష్ట్రంలో అన్ని న్యూస్ చానెళ్ళు, వార్తాపత్రికలు ఒక కొత్త ఫార్సుకు తెరతీశాయి. దాని పేరే “ఏకగ్రీవ ఫార్సు”.
రాష్ట్రంలో జరుగబోయే పంచాయితీ ఎన్నికలు నిజానికి పార్టీ రహితంగా జరగబోతున్నాయి. అట్లాంటి ఎన్నికల్లో అభ్యర్ధులు పార్టీ గుర్తుల మీద పోటీ చేయరు. అనేక గ్రామ పంచాయితీల్లో రెండు మూడు రాజకీయ పార్టీల వారు స్థానికంగా పొత్తుపెట్టుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
పై కారణాల వల్ల ఏ అభ్యర్ధిది ఏ పార్టీనో చెప్పడం చాలా కష్టం.
నిన్న సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. ఉపసంహరణ సమయం ముగిసిన అనంతరం ఏదైనా గ్రామ పంచాయితీ బరిలో ఒకే అభ్యర్ధి మిగిలి ఉంటే వారిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు.
మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, రెండు మూడు రాజకీయ పార్టీల వారు కలిస్తేనే ఒక అభ్యర్ది ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. అట్లాంటప్పుడు ఆ అభ్యర్దిని ఒక పార్టీ ఖాతాలో వేయడమే పెద్ద తప్పు.
కానీ మన తెలుగు మీడియా సంస్థలు మాత్రం తాము ఏ పార్టీకి కొమ్ము కాయాలనుకుంటే, ఆ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చినట్టు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఈ ప్రచారం ఎంత అసత్యమో చెప్పడానికి ఆదిలాబాద్ జిల్లాను ఒక సాంపిల్ గా మేము పరిశీలించాము. ఒకే గ్రామ పంచాయితీ అభ్యర్ధిని వేర్వేరు మీడియా సంస్థలు, వేర్వేరు పార్టీల ఖాతాలో వేస్తున్నారని ఈ కింది పట్టిక చూస్తే మీకు అర్థం అవుతుంది.
దీనివల్ల స్పష్టమయ్యేదేమిటంటే ఈ మీడియా సంస్థలు ఇస్తున్న పార్టీలవారీ అంకెలకు ఏ విలువా లేదు. అబధ్ధాలను, అర్థసత్యాలను నిజాలుగా చలామణీ చేయడంలో మన మీడియా ఎంత ఆరితేరిపోయిందో మరోసారి రుజువు అయ్యింది. కాబట్టి మిత్రులారా బహుపరాక్!