mt_logo

వాహ్… హరిత తెలంగాణ : ఐక్యరాజ్యసమితి

తెలంగాణ ద‌ట్ట‌మైన అడ‌వులు గ్రీన‌రీతో సుందరంగా కనిపిస్తుందని ఐక్యరాజ్యసమితి పర్యావరణశాఖ అధిపతి, గ్రీన్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిస్టిట్యుట్ ప్రెసిడెంట్ ఎరిక్ సోల్‌హెమ్ తన ట్విట్టర్లో వెల్లడించారు. ద‌ట్ట‌మైన అడ‌వుల‌తో తెలంగాణ బ్యూటిఫుల్‌గా క‌నిపిస్తోంద‌న్నారు. అతి త‌క్కువ స‌మ‌యంలోనే తెలంగాణ‌లో మూడు శాతం గ్రీన‌రీ పెరిగిన‌ట్లు ఎరిక్ త‌న ట్వీట్‌లో తెలిపారు. ఆ అద్భుత ప‌చ్చ‌టి అందాల‌ను తిల‌కించండి అంటూ ఎరిక్ త‌న ట్విట్ట‌ర్‌లో వ‌రంగ‌ల్ అడ‌వుల‌కు చెందిన వీడియోను పోస్టు చేశారు. ప‌చ్చ‌ద‌న‌మే టార్గెట్‌గా తెలంగాణ రాష్ట్రం చేప‌డుతున్న హ‌రిత‌హారం రాష్ట్రాన్ని గ్రీన‌రీ హ‌బ్‌గా మార్చేస్తూ.. స‌త‌తం హ‌రితం అన్న నినాదానికి దిక్సూచీ అయ్యింది. గ‌త కొన్నేళ్లుగా సాగుతున్న హ‌రిత‌హారం వ‌ల్ల రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌చ్చ‌ద‌నం ప‌ర‌వ‌ళ్లుతొక్కుతోంది. వ‌రంగ‌ల్ అడ‌వుల‌కు చెందిన ఏరియ‌ల్ వీడియోను ఫారెస్ట్ ఆఫీస‌ర్ మోహ‌న చంద్ర కూడా త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *