రాష్ట్ర ప్రభుత్వ కొత్త వెబ్ పోర్టల్ ను మరో వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు, ఈ వెబ్ పోర్టల్ మొదట ఇంగ్లీషులో, ఆ తర్వాత తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రారంభించనున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి హర్ ప్రీత్ సింగ్ తెలిపారు. రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, మిషన్ కాకతీయ, ముఖ్యమైన గణాంకాలు, వాటర్ గ్రిడ్ తదితర అంశాలకు సంబంధించి సమగ్ర సమాచారం ఈ పోర్టల్ లో ఉంచనున్నారు.
కొత్త వెబ్ పోర్టల్ ను ప్రత్యేక కథనాలతో, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు సులువుగా సమాచారాన్ని పొందేందుకు వీలుగా, సోషల్ మీడియాకు ధీటుగా ఉండేలా రూపొందిస్తున్నారు. రోజువారీ వార్తలతో ఈ వెబ్ పోర్టల్ ను జాతీయ, అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం ఉండేలా చర్యలు చేపడుతున్నారు.