పాపం సీమాంధ్రలో ఆందోళనకారులకు ఎవరిని టార్గెట్ చేయాలో కూడా అర్థమవడం లేదు. మొదట్లో సీమాంధ్ర ప్రాంతంలో తెలంగాణ ఉద్యోగులపై, నాయకులపై దాడులు చేసి భంగపడ్డ ఆందోళనకారులు ఇప్పుడు సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్న తమ నాయకులపైనే దాడులకు తెగబడుతున్నారు.
కర్నూల్ టౌనులో హిప్నోథెరపిస్టులు ఏర్పాటు చేసుకున్న దీక్షా శిబిరం వద్ద ప్రసంగించడానికి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసి రెడ్డిపై సీమాంధ్ర లాయర్లు దాడి చేశారు. వారి బారినుండి రక్షించుకునేందుకు తులసిరెడ్డి పరుగులు తీయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో తులసి రెడ్డి అంగీ కూడా చినిగిపోయింది.
ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తులసి రెడ్డి, సమైక్యవాద ముసుగులో వైసీపీ గూండాగిరికి పాల్పడుతోందని విమర్శించారు.