గ్రూప్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) సిలబస్ విడుదల చేసింది. సిలబస్ విడుదల సందర్భంగా కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ సుమారు 90మంది అధ్యాపకులు నెలపాటు శ్రమించి సిలబస్ తయారుచేశారని చెప్పారు. జూలై 27న ప్రభుత్వం స్కీంను ఆమోదించిందని ఆయన పేర్కొన్నారు.
గ్రూప్స్ 1, 2, 3, 4తో పాటు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల కోసం సిలబస్ తయారుచేశామని, సిలబస్ వెంటనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. నోటిఫికేషన్ వచ్చేలోపే అభ్యర్థులు ప్రిపేర్ కావొచ్చని, సిలబస్ లో తెలంగాణ చరిత్ర పొందుపరిచామని వెల్లడించారు. సిలబస్ రూపొందించిన మేధావులకు, ప్రొఫెసర్లకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు. అంతేకాకుండా సిలబస్ కమిటీలో ఉన్న 32మంది సభ్యులకు కూడా ఘంటా చక్రపాణి ధన్యవాదాలు తెలిపారు.
Please Click on the links to download Syllabus: