mt_logo

హిటాచి గ్లోబల్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ ఈరోజు గచ్చిబౌలిలో హిటాచి సొల్యూషన్ గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ లో హిటాచి సంస్థ కార్యక్రమాలు ప్రారంభించడం సంతోషంగా ఉందని, జపాన్ నుండి కూడా పరిశ్రమల స్థాపనకు ఆహ్వానిస్తామని, ఇందుకోసం అక్టోబర్ చివరివారం లేదా నవంబర్ మొదటివారంలో జపాన్ లో పర్యటిస్తామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో చైనా, దక్షిణ కొరియాలో పర్యటిస్తారన్నారు. ఇప్పటివరకు 35 కంపెనీలకు అనుమతులు ఇచ్చామని, త్వరలోనే మరో17 కంపెనీలకు అనుమతులు ఇవ్వబోతున్నామని కేటీఆర్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అధికసంఖ్యలో విదేశీ కంపెనీలు ముదుకొస్తున్నాయని, భారతదేశంలోకి అడుగుపెట్టే పలు కంపెనీలు తెలంగాణవైపు చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర సర్కార్ చేపట్టిన ప్రణాళికలు సక్సెస్ అవుతున్నాయని, జపాన్ కు చెందిన తోషిబా వంటి ప్రముఖ కంపెనీకి ఇక్కడ పరిశ్రమను నెలకొల్పేందుకు 12రోజుల్లోనే అనుమతి ఇచ్చామని గుర్తుచేశారు. అమెరికాకు చెందిన హిటాచి సంస్థకు పలు విభాగాల్లో పరిశ్రమలున్నాయని, దేశవ్యాప్తంగా హిటాచి సంస్థ సాఫ్ట్ వేర్ రంగంలో సుమారు 700 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నదని, అందులో తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన 400 మందికి ఉపాథి కల్పించడం హర్షణీయమని కేటీఆర్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *