mt_logo

రాష్ట్రంలో భారీగా ప్రభుత్వ కొలువుల జాతర 

ఉద్యోగార్థులకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. కొత్త సంవత్సరంలో భారీ కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇప్పటికే గ్రూప్‌-1 ద్వారా 503 పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ.. గురువారం గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ జారీ చేసింది. తద్వారా 25 శాఖల్లో ఏకంగా 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 23వ తేదీ నుంచి జనవరి 12 వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరించనున్నట్టు వెల్లడించింది.

గ్రూప్‌-4 రాతపరీక్షను వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలలో నిర్వహించనున్నట్టు తెలిపింది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపర్చనున్నట్టు పేర్కొన్నది. గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ ద్వారా ప్రతి శాఖలో కిందిస్థాయి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొత్తం 9,168 పోస్టుల్లో అత్యధికంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో 2,701 పోస్టులను భర్తీ చేయనున్నది. రెవెన్యూ శాఖలో 2,077, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో 1,245 పోస్టులు, ఉన్నతవిద్యలో 742 పోస్టులను నింపనున్నారు.

కాగా గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్థికశాఖ అనుమతినిచ్చిన వారం రోజుల్లోనే నోటిఫికేషన్‌ జారీ కావడం గమనార్హం. ఈ నెల 25న 9,168 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. దీంతో వెంటనే కసరత్తు ప్రారంభించిన టీఎస్‌పీఎస్సీ సరిగ్గా ఆరో రోజున నోటిఫికేషన్‌ను విడుదల చేసి దూకుడును ప్రదర్శించింది.

ఇక వరుస నోటిఫికేషన్లు :

వరుసగా నోటిఫికేషన్ల విడుదలకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో 61,804 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ అనుమతించింది. ఈ నేపథ్యంలోనే గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసి 503 పోస్టులకు రాతపరీక్ష నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ.. తాజాగా 9,168 పోస్టులతో గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ జారీ చేసింది. త్వరలో 726 పోస్టులతో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌, 1373 పోస్టులతో గ్రూప్‌-3 నోటిఫికేషన్‌ రానున్నాయి.  

శాఖల వారీగా గ్రూప్‌-4 పోస్టుల వివరాలు :

వ్యవసాయ, కో-ఆపరేషన్‌ శాఖ   : 44

పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్‌, మత్స్యశాఖ   : 02

బీసీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌   : 307

ఫుడ్‌-సివిల్‌సప్లయ్‌ డిపార్ట్‌మెంట్‌  : 72

విద్యుత్తు శాఖ   : 02

అటవీ, వాతావరణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ   : 23

ఆర్థిక శాఖ   : 255

జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌   : 05

వైద్యారోగ్య శాఖ   : 338

ఉన్నత విద్యాశాఖ   : 742

హోంశాఖ   : 133

పరిశ్రమల శాఖ   : 07

నీటిపారుదల శాఖ   : 51

కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ   : 128

మైనార్టీ సంక్షేమం   : 191

పురపాలక, పట్టణాభివృద్ది శాఖ   : 2701

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ   : 1245

ప్రణాళిక శాఖ   : 02

రెవెన్యూ శాఖ   : 2077

ఎస్సీ డెవలప్‌మెంట్‌ శాఖ   : 474

సెకండరీ ఎడ్యుకేషన్‌   : 97

రవాణా, రోడ్లు, భవనాల శాఖ   : 20

గిరిజన సంక్షేమ శాఖ    : 221

స్త్రీ, శిశు, దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్స్‌ శాఖ   : 18

యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ   : 13

మొత్తం   : 9,168

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *