విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు పూర్తిస్థాయి మద్దతు ఇస్తున్నట్టు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు నిర్ణయం మేరకు తమ పార్టీ యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలుపుతోందని కేటీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ తరపున తనతో పాటు తమ ఎంపీలు హాజరవుతున్నట్లు కేటీఆర్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

