వరంగల్ జిల్లాలో మీడియాతో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ అనుకోని సమయంలో అనుకోని విధంగా సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతోనే డిప్యూటీ సీఎం అయ్యానని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ ప్రజా నాయకుడని, నాలుగేళ్ళలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తిచేసి ప్రతి ఇంటికీ నీరందించకపోతే ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పిన ఘనత సీఎం కేసీఆర్ దేనని ప్రశంసించారు.
కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ అనే పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసిందని, వాటర్ గ్రిడ్ ద్వారా నాలుగేళ్ల కాలంలో తెలంగాణలోని అన్ని గ్రామాల్లో ప్రతీ ఇంటికీ తాగునీరు అందిస్తామని కడియం హామీ ఇచ్చారు.