mt_logo

మళ్ళీ టీఆర్ఎస్ పార్టీదే అధికారం : ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ

రాష్ట్రంలో మరోసారి టీఆర్‌ఎస్‌ పార్టీదే అధికారం అన్నారు ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ. బుధవారం శాసనసభలో బడ్జెట్ పై ప్రసంగిస్తూ… రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన భారీ ఉద్యోగ ప్రకటన వల్ల రాష్ట్రం మొత్తం పండగ వాతావరణం నెలకొందని, విద్యార్థులంతా ఆనందంలో మునిగి తేలుతున్నారని, తప్పకుండా ఈసారి కూడా టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో తలసరి ఆదాయం రూ.1.25 లక్షలుండగా, ఇప్పుడు రూ.2.72 లక్షలకు పెరిగిందని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ వైద్య సేవలను రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచడాన్ని, రాష్ట్రంలో తొలి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు ప్రకటనను స్వాగతిస్తున్నామని వెల్లడించారు. ఆసరా పింఛనుదారుల వయసును 57 ఏండ్లకు తగ్గించటంతో 3.03 లక్షలున్న దరఖాస్తులు 7.80 లక్షలకు పెరిగాయని తెలిపారు. ఓల్డ్‌ సిటీలో 5.5 కిలోమీటర్ల మెట్రో రైల్‌ నిర్మాణానికి రూ.500 కోట్లు, గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ వరకు మెట్రోరైల్‌ విస్తరణకు నిధులు కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. షాదీ ముబారక్‌ కింద 2 లక్షల మందికి సాయం చేశారని తెలిపారు. ఉర్దూ మీడియం అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఉర్దూలో డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుండగా… కేంద్రం చేసిందేమీ లేదని అక్బరుద్దీన్‌ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *