mt_logo

లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన, రైతు సంక్షేమంపై నినాదాలు

ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం స్ప‌ష్ట‌మైన విధానాన్ని ప్ర‌క‌టించాల‌ని టీఆర్ఎస్ ఎంపీలు మ‌రోసారి లోక్‌స‌భ‌లో డిమాండ్ చేశారు. మంగళవారం మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు స‌భ ప్రారంభ‌మైన త‌ర్వాత‌.. టీఆర్ఎస్ ఎంపీలు స్పీక‌ర్ పోడియం వ‌ద్ద‌కు వెళ్లి నినాదాలు చేశారు. మార్కెట్ యార్డుల్లో ఉన్న ధాన్యాన్ని సేక‌రించాల‌ని కోరారు. ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ.. ధాన్య సేక‌ర‌ణ‌పై జాతీయ విధానాన్ని ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. ధాన్యానికి కనీస మద్దతు ధర చట్టం చేయాలని, వ‌రిధాన్యం సేక‌ర‌ణ‌పై జాతీయ విధానం ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. వరి కొనుగోళ్ల కోసం నిర్దిష్టమైన విధానాన్ని ప్రకటించాలన్నారు. సాగు చట్టాల రద్దుకు జరిగిన పోరాటంలో అమరులైన అన్నదాతలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పీక‌ర్ ఏ రాజా.. టీఆర్ఎస్ ఎంపీల‌ను శాంతింపచేసేందుకు ప్ర‌య‌త్నించారు. రాజా ఎంత కోరినా తెలంగాణ ఎంపీలు వెనుదిర‌గ‌లేదు. దీంతో 3 గంట‌ల వ‌ర‌కు స‌భ‌ను వాయిదా వేశారు. మంగళవారం ఉద‌యం కూడా టీఆర్ఎస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకువెళ్లి కేంద్రానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేప‌ట్టగా.. సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *