లోక్ సభలో ఈరోజు ప్రత్యేక హైకోర్టు కోసం టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. జై తెలంగాణ నినాదాలతో లోక్ సభ మొత్తం మార్మోగిపోయింది. తమకు వెంటనే ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. వియ్ వాంట్ జస్టిస్, వియ్ వాంట్ హైకోర్టు అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం ముందు బైఠాయించి వారు నిరసన వ్యక్తం చేశారు.
ఏపీ హైకోర్టును తక్షణమే విభజించి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే ఈ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో ఎంపీలు ఆందోళనకు దిగారు.