mt_logo

దయాకర్ కు ఓటేస్తే లోకల్ కాల్ చేసినట్లే- హరీష్ రావు

బీజేపీ అభ్యర్థి దేవయ్యకు ఓటేస్తే ఐఎస్డీ కాల్ చేసినట్లు.. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు ఓటేస్తే ఎస్టీడీ కాల్ చేసినట్లు.. కానీ టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ కి ఓటేస్తే లోకల్ కాల్ చేసినట్లని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రి ఈరోజు వరంగల్ ఈస్ట్ లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. లోకల్ అభ్యర్థి అయిన పసునూరి దయాకర్ కు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని హరీష్ రావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ఇదిలాఉండగా ప్రచారం చివరి రోజైన నేడు వరంగల్ లోక్ సభ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు, కార్యకర్తలు సుడిగాలి పర్యటనలు చేస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. వరంగల్ ఈస్ట్ లో మంత్రి హరీష్ రావు, డిప్యూటీ సీఎం పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ గుండు సుధారాణి, కొండా సురేఖ దంపతులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ వెస్ట్ లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్, ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యేలు వినయభాస్కర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పరకాల నియోజకవర్గంలో మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, ప్రభాకర్ రెడ్డి, వేముల వీరేశం తదితరులు పాల్గొన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో మంత్రి జోగురామన్న, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, రాథోడ్ బాపూరావులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *