వరంగల్ లోక్ సభ టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ వరంగల్ ఓటర్లు తనను ఆశీర్వదిస్తారని, ఇప్పటికే నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తనకు ఓట్లు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారని అన్నారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ ఒక సామాన్యుడికి టికెట్ ఇచ్చి మంచి నిర్ణయం తీసుకున్నారని గ్రామస్తులు అనుకుంటున్నారని, రేపు తమకు కూడా అవకాశాలు రావచ్చనే ఆలోచనలో టీఆర్ఎస్ కార్యకర్తలు చురుగ్గా పార్టీకి సేవ చేస్తున్నారని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ కే గెలిచే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారని, తాను గెలిస్తే వరంగల్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పసునూరి దయాకర్ స్పష్టం చేశారు.