రైతులతో కలిసి భారీ ధర్నా నిర్వహించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

  • November 12, 2021 12:55 pm

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద రైతులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భారీ ధర్నా నిర్వహించారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా శుక్రవారం అన్ని నియోజకవర్గ స్థాయిలో టీఆర్ఎస్ నేతలు ధర్నా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండలో రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంజాబ్ లో రైతుల వడ్లు కొనే కేంద్రం.. తెలంగాణ రైతుల వద్ద ఎందుకు కొనరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో ధర్నా హోరెత్తించారు. ఈ ధర్నాలో నియోజక వర్గంలోని అన్ని మండలాల నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Connect with us

Videos

MORE