mt_logo

శాసనసభ సమావేశాలు:

ఈరోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే వైసీపీ,టీడీపీలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలు స్పీకర్ తిరస్కరించడంతో సభ్యులు ఆందోళనకు దిగారు. మరోవైపు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంత సభ్యులు నినాదాలు చేస్తుండటంతో సభను స్పీకర్ గంటపాటు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైనా తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం కిరణ్ ఇచ్చిన నోటీస్‌ను వెనక్కు తీసుకోవాలని జై తెలంగాణ నినాదాలతో ఆందోళన చేశారు. స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా వారి తీరు మారకపోవడంతో సభను మళ్ళీ గంటపాటు వాయిదా వేశారు. రెండుసార్లు వాయిదా పడినతర్వాత తిరిగి శాసనసభ ప్రారంభమయ్యింది. సభ ప్రారంభం కాగానే సభ్యులు మళ్ళీ ఆందోళనకు దిగారు. చేసేదిలేక స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *