ఓటర్లు తమ సమాచారాన్ని ఎన్నికల కమిషన్ ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్ 1950కి ఫోన్‌చేసి తెలుసుకోవచ్చు. అలాగే 9223166166 నంబర్‌కు ఎస్ఎంఎస్ కూడా చేయవచ్చునని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటరు తన ఎపిక్ కార్డు నంబర్ టైప్ చేసి ఎస్ఎంఎస్ చేస్తే వెంటనే పోలింగ్ స్టేషన్ సమాచారం తెలుస్తుంది. అలాగే ఈసీఐ రూపొందించిన నాఓట్ యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహిస్తారు. ఈవీఎంలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నది. నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి ఎక్కువమంది పోటీలో ఉన్నందున ఇక్కడ పోలింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. నిజామాబాద్‌లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తరువాత పోలింగ్ మొదలవుతుంది.