mt_logo

హైదరాబాద్ లో మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు

నిరుపేద రోగులకు రూపాయి ఖర్చు లేకుండా సూపర్‌ స్పెషాలిటీ వైద్యమందించేందుకు ప్రభుత్వం నగరానికి మూడు వైపులా అధునాతన దవాఖానలు నిర్మించబోతోంది. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) పేరుతో నిర్మించే మూడింటి నిర్మాణానికి రూ.రూ.2,679 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ గురువారం జీవో 41ను విడుదల చేసింది. కరోనా ఉధృతి సమయంలో గచ్చిబౌలిలో టిమ్స్‌ను ఏర్పాటు చేసి సేవలందించగా, ఈ మూడింటితో కలిపి టిమ్స్‌ దవాఖానల సంఖ్య నాలుగుకు చేరనున్నాయి. ఎల్‌బీనగర్‌ (గడ్డిఅన్నారం పండ్లమార్కెట్‌) సనత్‌నగర్‌ (ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రి) అల్వాల్‌ (బొల్లారం)లో సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలను నిర్మించనుండగా, టర్న్‌కీ పద్ధతిన టెండర్లు ఆహ్వానించాలని ఆర్‌అండ్‌బీ ఈఎన్సీని సర్కారు ఆదేశించింది. ప్రస్తుతం గచ్చిబౌలి టిమ్స్‌తోపాటు నూతనంగా నిర్మించబోయే మూడు టిమ్స్‌ దవాఖానలకు స్వయంప్రతిపత్తి (అటానమస్‌) హోదా ఇస్తున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది. మూడు నయా ఆస్పత్రులు అందుబాటులోకొస్తే ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌లపై ఒత్తిడి చాలా తగ్గనుంది.

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కేటీఆర్ :

నగరం చుట్టూ 3 సూపర్‌ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంపై సీఎం కేసీఆర్‌కు పురపాలక మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు. టిమ్స్‌ దవాఖానల వల్ల ప్రజలకు అధునాతన వైద్యసేవలు అందుతాయని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *