mt_logo

దేశంలోనే తొలిసారిగా బ్రెయిలీ లిపిలో చట్టాన్ని ముద్రించిన తెలంగాణ ప్రభుత్వం

దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్ర‌భుత్వం కంటి చూపులేని వారి కోసం ప్ర‌త్యేకంగా చ‌ట్టాన్ని బ్రెయిలీ లిపిలో రూపొందించ‌డం జ‌రిగింద‌ని రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగ‌ళ‌వారం ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ శాఖ బ్రెయిలీ లిపిలో ముద్రించిన మున్సిప‌ల్ చ‌ట్టం 2019 పుస్త‌కాన్ని రాష్ట్ర మున్సిప‌ల్ వ్య‌వ‌హ‌రాలు, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్క‌రించారు. రాష్ట్రంలో రోజు వారి వ్య‌వ‌హ‌రాల్లో అనేక మందికి మున్సిప‌ల్ చ‌ట్టం అవ‌స‌రం ఉంటుంద‌ని, ఈ నేప‌థ్యంలో కంటి చూపు లేని వారి కోసం బ్రెయిలీ లిపిలో ముద్రించ‌డం జ‌రిగింద‌న్నారు. బ్రెయిలీలో ముద్రించిన పుస్తకం అనేక మందికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, దీనిని స‌ద్వ‌నియోగం చేసుకోవాల‌ని మంత్రి కేటీఆర్ సూచించారు. బ్రెయిలీ లీపిలో ముద్రించినందుకు మున్సిప‌ల్ శాఖ సీడీఏంఎ ఎన్‌.స‌త్య‌నారాయ‌ణ‌, ఇత‌ర అధికారుల‌ను మంత్రి కేటీఆర్ ఈ సంద‌ర్భంగా అభినందించారు. మున్సిప‌ల్ చ‌ట్టాన్ని దేశానికి ఆద‌ర్శంగా ఉండే విధంగా, పార‌ద‌ర్శ‌కంగా ఉండే విధంగా రూపొందించ‌డం జ‌రిగింద‌న్నారు. దివ్యాంగులు కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం అనేక కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతుంద‌న్నారు. వారికి ఆస‌రా ఫించ‌న్ కింద నెల‌కు 3016 ఇస్తుంద‌న్నారు. దీనితో పాటుగా మూడు చ‌క్రాల వాహ‌నాలు , ఉద్యోగాల భ‌ర్తీలో రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డం జ‌రిగింద‌న్నారు. దివ్యాంగుల కోసం మాన‌వ‌తా దృక్ప‌దంలో సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాల‌ను చేప‌డుతున్నార‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే మున్సిప‌ల్ చ‌ట్టం తెలుగు, ఇంగ్లీషులో ముద్రించ‌డం జ‌రిగింద‌న్నారు. ఉద్యోగులు, ఉద్యోగులు కానీ వారు కంటి చూపులేని వారు సుల‌భంగా ఉప‌యోగించుకునే విధంగా దీనిని ముద్రించాం. వారు ఎదుర్కొనే సందేహాలు, స‌మ‌స్య‌లపై అవ‌గాహ‌న ఏర్ప‌డుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతితో పాటు అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *