mt_logo

ఐటీ ఉద్యోగుల గురించి మాట్లాడిన మొదటిపార్టీ టీఆర్ఎస్..

మానిఫెస్టోలో ఐటీ ఉద్యోగుల సంక్షేమం గురించి పొందుపరిచిన మొట్టమొదటి పార్టీ టీఆర్ఎస్ అని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల అన్నారు. టీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన మానిఫెస్టోలో ఐటీ గవర్నింగ్ బాడీ ఏర్పాటు ఉండటం హర్షనీయమని ఆయన అన్నారు. ఐటీ నుండి 40 శాతం పైగా ఆదాయం రాష్ట్రానికి వస్తుందని, కానీ ఇంతవరకూ ఏ ఒక్క పార్టీ కూడా ఉద్యోగుల సంక్షేమం గురించి మాట్లాడలేదని, ఒక్క టీఆర్ఎస్ పార్టీనే ఉద్యోగుల సంక్షేమం గురించి మాట్లాడిందని సందీప్ ఆనందం వ్యక్తం చేశారు. అందుకు కృతజ్ఞతగా త్వరలోనే టీఐటీఏ ప్రతినిధులు కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలుపుతామని వివరించారు. ఐటీ గవర్నింగ్ బాడీ ఏర్పాటు, నిర్వహణపై సూచనలతో కూడిన నివేదికను కేసీఆర్ కు అందజేయనున్నట్లు సందీప్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *