mt_logo

పాఠ్యాంశాలలో “తెలంగాణ పోరు వీరుల చరిత్ర” పై రౌండ్ టేబుల్ సమావేశం

వీర తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రిసోర్స్ సెంటర్ లో (చంద్రం బిల్డింగ్, ఆక్స్ ఫర్డ్ గ్రామర్ స్కూల్, స్ట్రీట్ నం. 11, హిమాయత్ నగర్) తెలంగాణ రచయితల వేదిక (తెరవే) ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ శుక్రవారం ఉదయం 11గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. పాఠ్యాంశాలలో “తెలంగాణ పోరు వీరుల చరిత్ర” అనే అంశంపై చర్చ జరుగుతుంది. ఈ చర్చలో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రొ. హరగోపాల్, ఎమ్. వేణుగోపాల్, ఎమ్మెల్సీలు పూల రవీందర్, సుధాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సిహెచ్ రాములు, రఘునందన్, టిటిఎఫ్, బి. హర్షవర్ధన్, టిపిఆర్టియు, పి. వెంకట్ రెడ్డి, పిఆర్టియు, బి. యాదగిరి, రాజేందర్, టిడిటిఎఫ్, స్వామిరెడ్డి, మల్లారెడ్డి, టియుటిఎఫ్, అనంతరాములు, టిఎస్టియు, నారాయణరెడ్డి, డిటిఎఫ్, టి. నర్సింహారెడ్డి, టిఆర్టియు, ఆర్. మల్లేశ్వరి, టిడబ్ల్యుటిఎఫ్, భుజంగరావు, పున్నారావు, ఎస్ టియు, రవి చందర్, అర్ టిఎఫ్, డా. మధుసూదన్ రెడ్డి, తెలంగాణ ఇంటర్ విద్య జాక్ చైర్మన్, తిరుపతి రెడ్డి, ఎపిటిఎఫ్, మణిపాల్ రెడ్డి, టిఆర్ టియు… అన్ని ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *