mt_logo

కనెక్టికట్‌లో ఘనంగా తేనా(TeNA) ఫ్రీడం కప్ 2015 క్రికెట్ టోర్నమెంట్

తెలంగాణ ఎన్నారై అసోసియేషన్(TeNA) కనెక్టికట్ చాప్టర్ వారు మాంచెస్టర్ నగరంలోని వికాం పార్కులో తేదీ 25 జూలై 2015న నిర్వహించిన క్రికెట్ పోటీలు ఆద్యంతం ఎంతో ఉత్సాహభరితంగా జరిగాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ పోటీలలో మొత్తం 8 జట్లు పాల్గొనగా, “మిడిల్ టవున్ వారియర్స్ 2” జట్టు విజేతగా నిలిచి ఫ్రీడం కప్-2015 ని చేజిక్కించుకొనగా, “పెవిలియన్ పాంథర్స్” జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది.

పోటీల అనంతరం బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన తేనా(TeNA) ప్రెసిడెంట్ డా. వెంకట్ మారోజు విజేతలైన జట్లకు ట్రోఫీలను అందజేసి అభినందనలు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా తేనా(TeNA) ద్వారా బోస్టన్ నగరంలో నిర్వహిస్తున్న ఆటల పోటీల గురించి వివరించారు. ఈ పోటీల ద్వారా సమకూర్చిన నిధులను తెలంగాణ రాష్ట్రంలో వివిధ సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తామని ఆయన తెలిపారు.

విక్రం రౌతు మాట్లాడుతూ, కనెక్టికట్‌లో మొదటిసారి నిర్వహించిన ఈ టోర్నమెంట్‌కు ఊహించినదానికంటే ఎక్కువ స్పందన వచ్చిందన్నారు. ఈ పోటీలలో పాల్గొనడానికి ముందుకొచ్చిన క్రీడాకారులు, వాలంటీర్లు మరియు అంపైర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని తేనా(TeNA) ప్రతినిధులు అమర్ కర్మిల్ల, రాజేందర్ కలువల, విక్రం రౌతు, సునీల్ తరాల, సతీష్ అన్నమనేని, రాకేష్ వంగళ, ప్రసాద్ కడారి, ధర్మారావు ఎర్రబెల్లి, కరుణాకర్ సజ్జన, సతీష్ గండ్ర, వెంకటేశ్వర్లు సిరిగనేని, శ్రీధర్ పతియార తదితరులు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *