కరీంనగర్ ఇందిరా గార్డెన్స్‌లో జరిగిన అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక రెండో మహాసభలకు సుప్రీం కోర్టు మాజీ జస్టిస్, గోవా లోకాయుక్త జస్టిస్ సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ తెలంగాణ రచయితలు సోక్రటీస్, కాళోజీల వారసులని శ్లాఘించారు.
“నేను మళ్ళీ మహాభారతాన్ని కోరుకోవడం లేదు. ఎందుకంటే మళ్ళీ మహాభారత యుద్ధం అంటే ఎట్లుంటదో ఒకసారి కాళోజీ అన్న మాటలు ఇక్కడ మీకు చెబుతున్న్నాను.
మళ్ళీ మళ్ళీ సైంధవులకు వరాలు
ఆచార్యుల పద్మవ్యూహాలు
మళ్ళీ అభిమన్యుల చిత్రవధలు
మళ్ళీ మహాభారతం
మళ్ళీ దుర్యోధనుల తొడలు విరగక తప్పదు
దుశ్శాసనుడి ఎదలు పగలక తప్పదు”
రచయితల వేదిక అధ్యక్షుడు డాక్టర్ నలిమెల భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో ఆచార్య ఎన్. గోపి, అల్లం నారాయణ, వేద్ కుమార్, జూకంటి జగన్నాధం, సూరేపల్లి సుజాత, అల్లం రాజయ్య తదితరులు పాల్గొన్నారు.