mt_logo

తెలంగాణ వైల్డ్ లైఫ్ బోర్డు ఏర్పాటు..

తెలంగాణ వైల్డ్ లైఫ్ బోర్డును ఏర్పాటు చేస్తూ అటవీశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. మొత్తం 29 మంది సభ్యులుగా ఉండే ఈ బోర్డుకు సీఎం కేసీఆర్ చైర్మన్ గా ఉంటారు. అయితే అటవీశాఖ ఏర్పాటు చేసిన బోర్డు ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేయాల్సిఉంది. 1972 వన్యప్రాణి సంరక్షణా చట్టం సెక్షన్ 6 ప్రకారం బోర్డు ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

వన్యప్రాణులు, అభయారణ్యాల సంరక్షణ వ్యవహారాలను ఈ వైల్డ్ లైఫ్ బోర్డు పర్యవేక్షిస్తుంది. రాష్ట్రంలోని అభయారణ్యాలు, జాతీయ పార్కుల సంరక్షణ వంటి వివిధ అంశాలకు సంబంధించి ఈ బోర్డుకు చట్టపరంగా విశేషమైన అధికారాలు ఉంటాయి. అటవీశాఖ మంత్రి దీనికి వైస్ చైర్మన్ గా, సభ్య కార్యదర్శిగా అటవీశాఖ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఉంటారు. ఎటువంటి పనులు చేయాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా ఈ బోర్డు అనుమతి తీసుకోవడం తప్పనిసరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *