తెలంగాణ కెనడా సంఘం Telangana Canada Association (TCA) అద్వ్యర్యంలో తేది 09 జనవరి 2016 శనివారం రోజున బ్రాంప్టన్ నగరంలోని చింగ్వాకూసి సెకండరీ పాఠశాల ఆడిటోరియంలో తెలంగాణ కెనడా తీన్మార్ సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు.
ఈ సంబురాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ చంద్ర స్వర్గం గారి ఆధ్వర్యంలో జరుగగా, ట్రస్టీ అధ్యక్షులు శ్రీ అఖిలేశ్ బెజ్జంకి, ఫౌండేషన్ కమిటి అధ్యక్షులు శ్రీ కుందూరి శ్రీనాధ్, ఉపాధ్యక్షులు శ్రీ కోటెశ్వరరావు చిత్తలూరి, సెక్రటరీ సయ్యద్ అతీక్ పాషా, కల్చరల్ సెక్రటరీ శ్రీ వేణు రోకండ్ల, ట్రెజరర్ శ్రీ దేవేందర్ గుజ్జుల, జాయింటు ట్రెజరర్ శ్రీ శంతన్ నేరెల్లపల్లి, డైరక్టర్లు శ్రీ వేణు గుడిపాటి, శ్రీ సంతోష్ గజవాడ, శ్రీ సమ్మయ్య వాసం, శ్రీ విజయ కుమార్ తిరుమలాపురం, శ్రీమతి రాధిక బెజ్జంకి, ట్రుస్టీలు శ్రీ హరి రావుల, శ్రీ రాజేశ్వర్ ఈద, శ్రీ ప్రభాకర్ కంభాలపల్లి, శ్రీమతి శిరీష స్వర్గం, ఫౌండర్లు శ్రీ ప్రకాశ్ చిట్యాల, శ్రీ నవీన్ సూదిరెడ్ది, శ్రీ శ్రీనివాస్ తిరునగరి, కలీముద్దీన్ శ్రీ రమేశ్ మునుకుంట్ల ముఖ్య మరియు వలంటిర్లు శ్రీ అనిల్ దుద్దుల, శ్రీ నర్సింహ మూర్తి కలగోని, శ్రీ మల్లికార్జున్ మదపు పాల్గొన్నారు.
శ్రీమతి రాధిక రావుల, శ్రీమతి దీప గజవాడ, శ్రీమతి సుధ కంబాలపల్లి, శ్రీమతి ధనలక్ష్మీ మునుకుంట్ల మరియు శ్రీమతి అరుణ గడ్డం గారల జ్యోతి ప్రజ్వలన తర్వాత మొదటగా తెలంగాణ అమరవీరులకు శ్రద్దాంజలి ఘటించి ఉత్సవాలను ప్రారంభించారు.
ఈ వేడుకలో ఎన్నోవివిద సాంస్కృతిక కార్యక్రమాలతొ దాదాపు 4 గంటలపాటు సభికులను అలరించాయి. ఆఖరున ప్రదర్శించిన తీన్మార్ డప్పు మరియు నృత్యం సభికులందరిని విపరీతంగా ఆకర్షించాయి.
ఈ సంబురాల్లో దాదాపు 500 పైగా కెనడా తెలంగాణ వాసులు పాల్గొని విజయవంతం చేసారు.
ప్రాధమిక పాఠశాల స్థాయి విధ్యార్థులకు డ్రాయింగు కాంపిటిషన్ నిర్వహించారు.
ఈ కార్యక్రమాలన్నీ స్థానిక తెలంగాణ వారు చక్కటి తెలంగాణ భానిలో ప్రదర్శించటం విశేషం.
సభికులందరికి తెలంగాణ కెనడా అసోసియేషన్ రుచికరమైన తెలంగాణ హైదరాబాద్ బిర్యాని మరియు ఇతర శాఖాహార వంటకాలతో భోజనాలు ఉచితంగా ఏర్పాటు చేశారు.
ఈ సభలో TCA 2016 తెలుగులో టొరొంటో టైములో చక్కటి తెలుగు క్యాలెండరును ఆవిష్కరించారు.
వ్యాఖ్యాతలుగా కుమారి మేఘ స్వర్గం కుమారి మనస్విని బెజ్జంకి, కుమారి ఐశ్వర్య ఈద, అభిజిత్ కంబాలపల్లి మరియు డాక్టర్ అనురాగ్ వ్యవహరించారు.
ఆఖరున శ్రీ కోటెశ్వరరావు చిత్తలూరి వందన సమర్పణతో కార్యక్రమాలు ముగిసాయి.