mt_logo

తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్ తోనే సాధ్యం-కేటీఆర్

తెలంగాణను సాధించుకోవడంతోనే సరికాదని, పునర్నిర్మాణం చేసుకున్నప్పుడే దానికి సార్థకత అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను పునర్నిర్మించుకుందామని, తెలంగాణ ప్రజల కోరిక మేరకే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయలేదని, అందుకు గ్రేటర్ హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంతో కాంగ్రెస్ పార్టీ మెడలు వంచితేనే తెలంగాణ ఇచ్చిందని, తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ రోడ్డెక్కని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఒక్క కేసైనా నమోదు కాలేదని, ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డప్పుడల్లా తెలంగాణ కాంగ్రెస్ నేతలు సీమాంధ్ర ముఖ్యమంత్రులతో లాలూచీ పడి తెలంగాణ వాదులపై దాడులు చేశారని ఆయన మండిపడ్డారు. మున్సిపల్, సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి టీఆర్ఎస్ సత్తా చూపుతామని, కాంగ్రెస్ కు తగిన బుద్ధి ప్రజలే చెప్తారని కేటీఆర్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్ లో గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ ఎస్సీ సెల్ ఇన్చార్జిగా కేపీ దాస్ ను, గ్రేటర్ పార్టీ ప్రధాన కార్యదర్శి కైసర్ పటేల్ ను, సంయుక్త కార్యదర్శిగా జీ. రాజు తదితరులను నియమిస్తూ కేటీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *