mt_logo

బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రాలలో తెలంగాణకు మొదటి స్థానం

ఇప్పటికే దేశంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణ, బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రాల్లోనూ మొదటి స్థానంలో నిలిచి, ఔత్సాహిక అభివృద్ధి మోడల్ గా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నివేదికలో 96.74% తో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా… తర్వాత స్థానాల్లో తమిళనాడు (35.39%), కేరళ (19.78%), ఉత్తరాఖండ్ (09.01%), హరియాణ (05.75%), కర్ణాటక(5.59%), ఆంధ్ర ప్రదేశ్ (04.63%) రాష్ట్రాలు ఉన్నాయి. కాగా.. జమ్ము కాశ్మీర్, బీహార్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, మిజోరం, త్రిపుర, గోవా మొదలైన 7 రాష్ట్రాలు సున్న ప్రగతితో ఆఖరున ఉన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుతూ.. స్వచ్చ తెలంగాణ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో భాగస్వాములైన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, ప్రజలకు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని గ్రామాలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తూ…మన రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉందని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి పథకాల వల్లనే మన పల్లెలు ఆదర్శంగా మారాయని అన్నారు. పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు ఇలా అనేక అభివృద్ది పనులు చేపడుతూనే.. నిరంతరం పారిశుధ్య పనులు చేయడం వల్లే ఇలాంటి ప్రశంసలు, అభినందనలు వస్తున్నాయి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *