mt_logo

టీవీ9, ఏబీఎన్ లపై మండిపడుతున్న తెలంగాణసంఘాలు

తెలంగాణ సమాజాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్న ఆంధ్రా మీడియాకు బుద్ధి చెప్తామని తెలంగాణ ఎంఎస్‌వోల సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి హెచ్చరించారు. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని, తెలంగాణ ప్రజలను, తెలంగాణ చట్టసభల సభ్యులను విమర్శిస్తూ టీవీ9 బుల్లెట్ న్యూస్ లో ప్రసారం చేయడాన్ని సంఘం తీవ్రంగా ఖండించింది.

మరోవైపు తెలంగాణ శాసనసభ్యులను కించపరిచిన టీవీ9 పై మండిపడిన తెలంగాణ అడ్వకేట్లు నిరసన వ్యక్తం చేస్తూ టీవీ9 ఆఫీసు ముందు బైఠాయించారు. టీవీ9 డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ సీఈవో రవిప్రకాష్ వెంటనే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

ఇదిలావుండగా తెలంగాణ రూరల్ లో టీవీ9, ఏబీఎన్ ఛానళ్ళను బంద్ చేయాలని తెలంగాణ రూరల్ అండ్ ఎంఎస్‌వో ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ పాల్వంచ కోటేశ్వర్ పిలుపునిచ్చారు. శాసనసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీవీ9 పట్ల నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ రూరల్ లో బంద్ కు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ సమాజాన్ని కించపరిచేలా టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానళ్ళు ప్రసారం చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *