మండలికి సంబంధించి గతంలో ఉన్న చట్టాల్లో మార్పులు చేసి తెలంగాణ ఐటీకి ప్రత్యేక మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 ప్రకారం సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్ వర్క్ పాలకమండలిని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాలకమండలి చైర్మన్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైస్ చైర్మన్ గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్యకార్యదర్శితో పాటు మరో 18 శాఖల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని తెలిసింది.
ఇదిలాఉండగా రాష్ట్రంలో కొత్తగా వెటర్నరీ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీని విభజిస్తూ తెలంగాణ రాష్ట్రం కోసం కొత్తగా పీవీ నరసింహారావు తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ ఫర్ వెటర్నరీ, యానిమల్ అండ్ ఫిషరీస్ సైన్సెస్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.