తెలంగాణ ఏర్పాటు వల్ల హైదరాబాదుకు, ఇక్కడి సాఫ్ట్ వేర్ పరిశ్రమకు ఏదో జరిగిపోతుందని కొంతమంది దుష్ప్రచారం మొదలుపెట్టిండ్రు. వీరికి సీమాంధ్ర మీడియా వంతపాడుతోంది.
“సేవ్ ఐటీ – సేవ్ హైదరాబాద్ జేయేసీ” అని ముసుగు సంస్థ ఏర్పాటు చేసి “బ్రాండ్ హైదరాబాద్” కు ఏదో జరుగుతోందని తెలుగు దేశం పార్టీ గత వారం రోజులుగా దుష్ప్రచారం చేస్తోంది.
నిన్న ఇదే అంశంపై V6 చానెల్ చర్చా వేదికలో మిషన్ తెలంగాణకు చెందిన కొణతం దిలీప్, తెరాస నేత శ్రవణ్ దాసోజు ఈ దుష్ప్రచారాన్ని సమర్ధవంతంగా తిప్పికొట్టారు.
సేవ్ ఐటి జేయేసి సభ్యులు చెబుతున్న గణాంకాల్లో నిజం లేదని, వారి వాదనలో పసలేదని చర్చ ప్రారంభమైన తొలి నిముషాల్లోనే దిలీప్, శ్రవణ్ రుజువు చేయడంతో సదరు సంస్థ ప్రతినిధులు తెలంగాణ ఏర్పాటుకు హైదరాబాద్ ఐటీ రంగానికి ఏ సంబంధం లేదని చెప్పడం గమనార్హం.