mt_logo

తెలంగాణలో ‘డైఫు’ రూ.450 కోట్ల పెట్టుబడులు : మంత్రి కేటీఆర్

తెలంగాణ‌లో జ‌ప‌నీస్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ సంస్థ‌ DAIFUKU భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. హైద‌రాబాద్‌లోని చంద‌న‌వెల్లిలో ‘డైఫు’ కు ఇండియా మాన్యుఫ్యాక్చ‌రింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయ‌నుంది. ఈ మేర‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో DAIFUKU ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. రూ.450 కోట్ల‌తో ఏర్పాటు చేయ‌నున్న ఈ యూనిట్ ద్వారా సుమారు 800 మందికి పైగా ప్ర‌త్య‌క్షంగా ఉపాధి క‌ల్పించ‌నుంది. ఆటోమేటెడ్ స్టోరెజ్ సిస్ట‌మ్స్‌, క‌న్వేయ‌ర్లు స‌హా ఆటోమేటిక్ స్టార్ట‌ర్స్ వంటి ప‌రిక‌రాల‌ను ఈ సంస్థ త‌యారు చేస్తోంది. 2 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం కంటే ఎక్కువ పెంచి అత్యాధునిక ప‌రిశ్ర‌మ‌ను స్థాపించ‌నుంది. మొద‌టి ద‌శ విస్త‌ర‌ణ కోసం రూ. 200 కోట్ల ప్ర‌ణాళికాబ‌ద్ధ‌మైన పెట్టుబ‌డికి ప్ర‌ణాళికలు రూపొందించింది. రాబోయే 18 నెల‌ల్లో నూత‌న ప‌రిశ్ర‌మ‌ను ప్రారంభించాల‌నే యోచ‌న‌లో ఉంది.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. క‌రోనా త‌ర్వాత పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు రావ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. అనేక మాన్యుఫ్యాక్చ‌రింగ్ యూనిట్లు హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డులు పెడుతున్నాయ‌న్నారు. జపాన్ అద్భుత‌మైన టెక్నాల‌జీ ఉప‌యోగించుకొని ముందుకు వెళ్తుంద‌న్నారు. దండు మైలారంలో అతిపెద్ద పారిశ్రామిక పార్కు తీసుకొచ్చామ‌న్నారు.

ఇండియాలో త‌మ ఉత్ప‌త్తుల త‌యారు వేగ‌వంతం చేస్తామ‌ని సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ గ‌రిమెళ్ల స్ప‌ష్టం చేశారు. క‌స్ట‌మ‌ర్ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎక్కువ సామ‌ర్త్యంతో ఉత్ప‌త్తులు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. మంత్రి కేటీఆర్ తెలంగాణ బ్రాండ్ అంబాసిడ‌ర్ అని కొనియాడారు. చంద‌న‌వెల్లిలో మాన్యుఫ్యాక్చ‌రింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *