mt_logo

దేశవిదేశాలకు తెలంగాణ బ్రాండ్!!

మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు సైతం బ్రాండ్ తెలంగాణ ఉత్పత్తులు మార్కెటింగ్ చేసే దిశగా తెలంగాణ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రాష్ట్రంలో పెరుగుతున్న పంట దిగుబడులకు స్థానికంగానే మార్కెటింగ్, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు, మహిళా సంఘాలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో తయారుచేసి, ఎగుమతి చేసే ఆహార ఉత్పత్తులకు బ్రాండ్ తెలంగాణ ఇమేజ్ రానుంది. అంతేకాకుండా స్థానికంగా ఏర్పాటుచేసే ఆహార శుద్ధి కేంద్రాల నుండి కూడా ఉత్పత్తులను బ్రాండ్ తెలంగాణ పేరుతోనే మార్కెటింగ్ చేయనున్నారు.

జిల్లాలవారీగా ప్రధానంగా పండుతున్న పంటలు, వాటి ఆధారిత పరిశ్రమలపై ప్రాధమిక నివేదికను జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖ అధికారులు సిద్ధం చేశారు. కొన్ని ప్రాంతాలను కూడా గుర్తించి అక్కడ ఏ పరిశ్రమ పెడితే బాగుంటుంది అనే విషయాలను ఆ నివేదికల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో ప్రస్తుతం పండుతున్న పంటలకు గిట్టుబాటు ధర, దిగుబడి, ఆయా జిల్లాల్లో వాటి నిల్వ, గోదాముల సామర్ధ్యం, మార్కెటింగ్ అంశాలపై అధికారులు పరిశీలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *