mt_logo

తెలంగాణ రాష్ట్ర పరిధిలోని రెవెన్యూ అకాడెమీకి తెలంగాణ ద్రోహి పేరు!

రాబోయే తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి రానున్న రెవెన్యూ అకాడెమీకి సీమాంధ్ర ప్రాంత నేత నీలం సంజీవరెడ్డి పేరు పెడుతూ ప్రభుత్వం హడావిడిగా చర్యలు తీసుకోవడం చూసి తెలంగాణ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో చరిత్ర ఉన్న కేవీ రంగారెడ్డి, బూర్గుల పేర్లు విస్మరించి తెలంగాణద్రోహిగా ముద్రపడ్డ నీలం పేరును సూచించడంలో అర్థం ఏమిటని పలువురి వాదన. న్యాయవాద వృత్తిలో ఉన్నా, మంత్రిగా ఉన్నా రెవెన్యూకి సంబంధించిన విషయాల్లో ఆయనది అందె వేసిన చేయి. భూసంస్కరణలు అమలయ్యేట్లు పోరాడిన కేవీ రంగారెడ్డి ఎంతో ఆదర్శప్రాయుడు. భూసంస్కరణల చట్టం ప్రకారం తన భూములను సర్కారుకు అప్పగించిన భూస్వామ్య కుటుంబానికి చెందిన వ్యక్తి ఆయనకాగా, అప్పటి మద్రాసు ప్రభుత్వం స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నవారికి ఇచ్చిన భూములను కూడా స్వతంత్ర యోధుడిని అని తీసుకున్న నీచ చరిత్ర నీలం సంజీవయ్యది.

అనంతపురానికి చెందిన నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా, ముఖ్యమంత్రిగా పనిచేశారు. పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మొదలైంది. నీలం సంజీవరెడ్డి తర్వాత సీఎంగా కేవీ రంగారెడ్డి పేరు వినపడ్డా, నీలం సంజీవరెడ్డి కుట్రలు చేసి దామోదరం సంజీవయ్యను సీఎంగా ఎన్నుకున్నారు. తెలంగాణ వారు సీఎం కాకుండా అడ్డునిలిచి తెలంగాణ ద్రోహిగా ముద్రపడ్డారు.

హైదరాబాద్ లో విగ్రహాలకు గానీ, పేరెన్నికగన్న ప్రాంతాలకు గానీ తెలంగాణ పోరాటయోధుల పేర్లు పెట్టకుండా తెలంగాణకు ద్రోహం చేసిన వారి పేర్లు పెట్టడంపై ఇక్కడి ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *