mt_logo

తెలంగాణపై మహానాడు తీర్మానం పచ్చి అబద్ధం!

అబద్ధం ముందు పుట్టి తరువాత చంద్రబాబు పుట్టాడని మరోసారి నిరూపణ అయ్యింది. మొన్న మే నెలలో జరిగిన తెదేపా మహానాడులో తెలంగాణపై తీర్మానం చేయాలని తెలంగాణవాదులు డిమాండ్ చేశారు. తదనుగుణంగానే తెలంగాణపై స్పష్టతనిస్తూ మహానాడులో తీర్మానం చేసినట్టు తెలుగుదేశం ప్రకటించింది. ఆ పార్టీకి దన్నుగా నిలబడే అన్ని మీడియా సంస్థలు తెలుగుదేశం చేసిన “తీర్మానం” మీద బోలెడు వార్తా కథనాలు వండాయి. తెలుగుదేశం పార్టీ తెలంగాణపై స్పష్టమైన వైఖరి తీసుకోవడంతో ఇక టీఆరెస్ కు గడ్డుకాలమేనని కూడా ఆ మీడియా సంస్థలు సెలవిచ్చాయి.

తెలంగాణపై మహానాడులో తీర్మానం చేశాం కనుక ఇక తమకు ఎదురేలేదని టీటీడీపీ నాయకులు జబ్బలు చరుచుకుంటున్నారు.

మూడు రోజుల కింద వరంగల్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు కూడా తాము తెలంగాణపై మహానాడులో తీర్మానం చేశాం కనుక తమ చిత్తశుద్ధిని శంకించొద్దని చెప్పుకొచ్చాడు.

అయితే తెలంగాణ పై నిజంగా తెలుగుదేశం మహానాడులో తీర్మానం చేసిందా అని తరచి చూస్తే దిగ్బ్రాంతికరమైన నిజాలు బయటపడ్డాయి. మహానాడు ముగిసిన తరువాత తెలుగు దేశం పార్టీ ముద్రించి పంచిన మహానాడు తీర్మానాల బుక్ లెట్ లో తెలంగాణ అన్న పదం కూడా లేదు!

ఆ బుక్ లెట్ ఇక్కడ చదవండి: http://www.telugudesam.org/mahanadu2013/Mahanadu-teermanalu-2013.pdf

తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి తెలుగుదేశం పార్టీ మరోసారి చీప్ ట్రిక్ కు పాల్పడిందని ఈ బుక్ లెట్ చదివితే స్పష్టమవుతుంది. నిజానికి మహానాడులో తెలుగుదేశం తెలంగాణపై ఏ తీర్మానమూ చేయలేదు. కేవలం మీడియా ముందు తాము తీర్మానం చేశామని ప్రకటించారు. కానీ ఇప్పుడు వారే వేసిన మహానాడు తీర్మానాల బుక్ లెట్ లో తెలంగాణ తీర్మానం ఊసు లేకపోవడంతో వారి బండారం బయటపడింది.

కేవలం తనకున్న మీడియా భజనపరుల సాయంతో అబద్ధాన్ని నిజం చేయబోయిన తెలుగుదేశం పార్టీ మరోసారి బొక్కబోర్లా పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *