mt_logo

ట్రిక్కులు, టక్కరి వేషాలు మానని టిడిపి

By: కట్టా శేఖర్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ ట్రిక్కులు, టక్కరి వేషాలు మానలేదు. ఎన్నికల సమయానికి ఏదో ఒక కొత్త వేషం కట్టడం ఆ పార్టీకి అలవాటే. ఇప్పుడు తెలంగాణ విషయంలో కూడా మరోసారి ఆ పార్టీ అటువంటి వేషం వేయడానికే సిద్ధపడుతున్నాడు చంద్రబాబు. తెలంగాణపై స్పష్టంగా, నిజాయితీగా, సూటిగా తమ వైఖరిని చెప్పి, కోల్పోయిన విశ్వాసాన్ని చూరగొనడానికి బదులు, నాలుకను అనేక మెలికలు తిప్పి, మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు.

ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తిలు చేసిన తెలంగాణ తీర్మానానికే దిక్కులేకుండా పోయింది. ఎర్రబెల్లి ప్రవేశపెట్టే తీర్మానాన్ని ఎవరు నమ్ముతారు?

ఎర్రబెల్లి, మోత్కుపల్లి తీర్మానాలు చేస్తారు, పయ్యావుల కేశవ్, దేవినేని ఉమ, కోడెల శివప్రసాద్, ఆలపాటి రాజేంద్రప్రసాద్ రాజీనామాలు చేస్తారు. 2009 డిసెంబరు 9న స్వయంగా చంద్రబాబే అడ్డం తిరిగారు. వీళ్లను నమ్మేదెలా?

తెలంగాణ తీర్మానం ఎర్రబెల్లి ఎందుకు ప్రవేశపెట్టాలి? పయ్యావుల కేశవ్, దేవినేని ఉమ, కోడెల శివప్రసాద్ ఎందుకు ప్రవేశపెట్టరు? ఎర్రబెల్లి ప్రవేశపెట్టేది పార్టీ తీర్మానమా, ప్రాంతీయ తీర్మానమా? తెలంగాణపై సిపిఐ ఒక తీర్మానం చేస్తే, ఆ పార్టీ కార్యదర్శి కె.నారాయణ కట్టుబడి కొట్లాడడం లేదా? టీడీపీ సీమాంధ్ర నేతలు ఆ పని ఎందువకు చేయరు?

చంద్రబాబు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వస్తాడట. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాడట. వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిస్తాడట. తెలంగాణ ఇస్తామని, శాసనసభలో తీర్మానం ఆమోదిస్తామని, కేంద్రంలో తెలంగాణ బిల్లు పెట్టిస్తామని మాత్రం చెప్పడట.

చంద్రబాబు తెలంగాణపై నిర్ణయం తీసుకున్నరోజు ఏం మాట్లాడాడు?
తెలంగాణపై నిర్ణయం వచ్చినరోజు ఏం మాట్లాడాడు?
సీమాంధ్ర టీడీపీ నేతల రాజీనామాలపై ఏం మాట్లాడాడు?

11-10-2008 రోజు తెలుగుదేశం పార్టీ ప్రకటన

10-12-2009 రోజు తెలంగాణకు అడ్డం తిరిగిన చంద్రబాబు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *