mt_logo

వీధి రౌడీలా ప్రవర్తించిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్

ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పార్లమెంటు ఉభయసభలు విపక్షాల ఆందోళనల మద్య కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. గంటపాటు వాయిదా వేస్తున్నట్లు లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. వాయిదా అనంతరం ఉభయసభలు ప్రారంభమైన కాసేపటికే సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలతో సీమాంధ్ర ఎంపీలు రాజ్యసభలో ఆందోళన చేయడంతో చైర్మన్ స్థానంలో ఉన్న కురియన్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ వీధిరౌడీలా ప్రవర్తించడంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజ్యసభ సెక్రటరీ జనరల్ షంషేర్ షరీఫ్ సభకు తెలంగాణ బిల్లు వచ్చిందని ప్రకటన చేస్తుండగా సీఎం రమేశ్ ఉన్మాదిలా ఆయన చేతిలోని బిల్లు ప్రతులను లాక్కునేందుకు ప్రయత్నించాడు. పెద్దవాడు అని కూడా లెక్కచేయకుండా దాడి చేయడంపై రాజ్యసభ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ టీడీపీ ఎంపీ గుండు సుధారాణి రమేష్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కేంద్రమంత్రి చిరంజీవి, సుబ్బిరామిరెడ్డి నిల్చోవడంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఆగ్రహంతో మీరు నిల్చునేది ఉంటే రాజీనామా చేసి నుంచోవాలని అన్నారు. తెలంగాణ సహా అన్ని బిల్లులపై చర్చ కొనసాగాలని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. సభ సజావుగా జరిగేలా సహకరించాలని కురియన్ ఆదేశించినా, సీమాంధ్ర ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, కేవీపీ సమైక్యాంధ్ర ప్లకార్డులు పట్టుకుని పోడియం ముందు నిల్చుని ఆందోళన చేపట్టడంతో సభ సాయంత్రం నాలుగుగంటలకు వాయిదా పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *