టీడీపీ సహజ మరణం!!

  • March 30, 2019 8:10 pm

By: టంకశాల అశోక్

ఎన్టీఆర్ స్థాపించినప్పటినుంచి మొదలుకొని, తెలంగాణ ఉద్యమం తిరిగి మొదలయ్యేవరకు తెలుగుసీమలో నిజంగానే ఒక చారిత్రక పాత్రను పోషించిన తెలుగుదేశం పార్టీకి, తెలంగాణ ఉద్యమం రాకతో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో మౌలికమైన వైరుధ్యాలు ఏర్పడ్డాయి. ఆ వైరుధ్యాలకు తార్కికమైన ముగింపు తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ ఒక సహజ మరణానికి గురి కావటం. తమ 37 సంవత్సరాల చరిత్రలో వారు మొట్టమొదటిసారిగా ఒక ఎన్నికలో, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో, పోటీ చేయకుండా అధికారికంగా విరమించుకున్నారంటే అది సహజ మరణమే. ఇంకా ఒక ఎమ్మెల్యే, కొద్దిమంది స్థానిక సంస్థల ప్రతినిధులు, ఒక పార్టీ వ్యవస్థ అంటూ మిగిలి ఉండటం సాంకేతికంగా సజీవంగా ఉండటమేనని ఆ పార్టీ నాయకత్వం భావించవచ్చు గాక. కానీ పార్టీలను సజీవంగా ఉంచేది రాజకీయమే తప్ప సాంకేతికతలు కాదు. ఆ విధంగా చూసినప్పుడు టీడీపీ నామమాత్రావ శిష్టత మరణ సమానమే అవుతుంది తప్ప సజీవత కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీది తప్పక ఒక చారిత్రకమైన పాత్ర. అంతవరకు ఏకపక్ష రాజకీయ వ్యవస్థగా ఉన్న స్థితిలో కాంగ్రెస్‌ను పడదోసి రాష్ట్రంలో రెండు పార్టీల వ్యవస్థ ఏర్పడింది టీడీపీ ఆవిర్భావంతోనే. అంతకుముందు వేర్వేరు దశలలో కమ్యూనిస్టులు, జనతా పార్టీ, రెడ్డి కాంగ్రెస్ వంటివి కాంగ్రెస్‌కు తాత్కాలిక సవాళ్లు కాగా, టీడీపీ ఒక దీర్ఘకాలిక సవాలుగా మారి స్థిరపడింది. ఇది ఒక మౌలిక మార్పు కాగా, తెలుగు సీమ కేంద్రంగా ఒక బలమైన ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించి దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలతో పాటు ఒక వేదికగా మారటం రెండవ మౌలిక మార్పు. మూడవది, ప్రజా సంక్షేమాన్ని ఎన్టీఆర్ తనకన్న ముందటి సుదీర్ఘ కాంగ్రెస్ పరిపాలనా కాలం కన్న ఎంతో ఎక్కువగా అజెండాపైకి తీసుకురావటం.

అంతర్గత వలస బాధితులు, ఇతరత్రా కూడా వెనుకబాటు తనానికి, ఆర్థిక సంస్కరణలకు బాధితులైన తెలంగాణ బడుగువర్గాలు చూస్తూ చూస్తుండగానే టీడీపీ వైపు నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వైపు మళ్లటంతో ఆ పునాదులు మరింత కదిలాయి. ఉద్యమం వైపు అన్నివర్గాలు మళ్లాయి. అదే సమయంలో ముఖ్యంగా టీడీపీ పెట్టనికోటగా ఉండిన బలహీనవర్గాలు, యువకులు మళ్లటం ఒక పెను మార్పు అయింది. ఆ కాలమంతా ఎన్టీఆర్ పథకాలు, వాటి సత్ఫలితాలు జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశమయ్యాయి. నాల్గవది, అంతవరకు కాంగ్రెస్‌తో ఉండిన బడుగు బలహీన వర్గాలను ముఖ్యంగా బీసీలను ఎన్టీఆర్ తన వైపు బలంగా పెద్ద ఎత్తున ఆకర్షించి, పార్టీకి పునాదిగా మార్చుకోవటం. ఇక చివరగా రామారావు వ్యక్తిగతంగా జాతీయ ప్రతిపక్ష రాజకీయాల్లో నిర్వహించిన పాత్ర. ఆయన కారణంగా తెలుగు వారికి జాతీయస్థాయిలో లభించిన ప్రశస్తి. ఈ అయిదింటిని కలిపి చూసినప్పుడు ఆ కాలమంతా టీడీపీది చారిత్రకమైన పాత్ర అంటున్నాము. ఈ అయిదు అంశాలను విస్తృతంగా, లోతుగా అధ్యయనం చేస్తూ అకడమిక్ అధ్యయనాలు ఏవీ ఇంతవరకు వెలువడలేదు. ఆ పని జరిగినప్పుడు ఆ పాత్ర ప్రాముఖ్యం అర్థమవుతుంది. ఇదంతా ఇంతగా రాయటం ఎందుకంటే, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రాకతో, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో టీడీపీకి వచ్చినటువంటి వైరుధ్యం ఎంత తీవ్రమైనదో అర్థం అయ్యేందుకు ఈ నేపథ్యం తప్పక తెలియాలి. ఆ వైరుధ్యానికి మూలం సీమాంధ్ర ధనిక వర్గాలు తెలంగాణను ఒక అంతర్గత వలసగా పరిగణించటంతో మొదలైంది. అసలు వారు ఉమ్మడి రాష్ట్రాన్ని కోరటంలోని ఉద్దేశమే తెలంగాణను అంతర్గత వలసగా మార్చుకోవటమనే బలమైన వాదన, అందుకు తగిన కొన్ని ఆధారాలు ఉండనే ఉన్నాయి. మొత్తమ్మీద అక్కడి వర్గాలకు ప్రతినిధి కావటం వల్ల అందువల్ల తెలంగాణ ప్రజల ప్రయోజనాలతో ఏదో ఒక రోజున వైరుధ్యం తప్పసనిసరి అయింది. అక్కడి ప్రజల్లో స్వీయ చైతన్యం తలెత్తి ఆకాంక్షలు ముందుకురానంతవరకే ఎన్టీఆర్ కరిష్మా, సంక్షేమం, తెలుగువాడి ఆత్మగౌరవం వంటి నినాదాలు తెలంగాణ ప్రజలను భ్రమలలో ఉంచగలవు. అప్పుడు వైరుధ్యాలు ముందుకురావు. కానీ కాలక్రమంలో చైతన్యాలు పెరుగుతూ, ఆకాంక్షలు పెరిగేకొద్దీ పరిస్థితి మారింది.

అసెంబ్లీ పర్వం ముగిసి లోక్‌సభ ఎన్నికలు వచ్చేసరికి, ఈ మూడు మాసాల కాలంలో టీడీపీ తక్కిన కూటమి పార్టీలన్నింటికీ కనీసం అంటరానిదిగా మారింది. కాంగ్రెస్ నుంచి పొత్తుమాట కాదుగదా అసలు సంప్రదింపులు లేకపోయాయి. తక్కినవారందరికి కూడా ఈ పార్టీ ఒక అక్రమ సంబంధంగా తోచి భయపడ్డారు. పొత్తులు, సీట్లు అక్కరలేదు కనీసం మా మద్దతు అడగండి ఇస్తామన్నా, అలా అడిగేందుకు ఎవరూ సాహసించలేదు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా అందరికీ కలిసి ఒక జనరల్ అప్పీల్ మాత్రం చేశారు. నిజం చెప్పాలంటే ఇది ఒక పరాభవకరమైన స్థితి. కానీ చేయగలిగింది లేదు.

దీని ప్రభావంతో మొట్టమొదట బీటలువారటం మొదలైంది తెలుగుజాతి అనే భావన లేదా ప్రచారం. ఆ విధంగా, ఎన్టీఆర్ సృష్టించిన తన పార్టీ పునాదులు కదలసాగాయి. అంతర్గత వలస బాధితులు, ఇతరత్రా కూడా వెనుకబాటు తనానికి, ఆర్థిక సంస్కరణలకు బాధితులైన తెలంగాణ బడుగువర్గాలు చూస్తూ చూస్తుండగానే టీడీపీ వైపు నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వైపు మళ్లటంతో ఆ పునాదులు మరింత కదిలాయి. ఉద్యమం వైపు అన్నివర్గాలు మళ్లాయి. అదే సమయంలో ముఖ్యంగా టీడీపీ పెట్టనికోటగా ఉండిన బలహీనవర్గాలు, యువకులు మళ్లటం ఒక పెను మార్పు అయింది. ఈ మార్పుల మధ్య, తెలుగు జాతి భావన భంగపడింది. సీమాంధ్ర ధనికవర్గ తెలుగులు, తెలంగాణ తెలుగుల ప్రయోజనాలు వేర్వేరు అన్న ఆలోచన ఒకసారి రావటంతో, ఆ విధంగా జాతి భావన దెబ్బతినటంతో, టీడీపీకి ఆధారభూతమైన మరొక పునాది బలహీనపడటం మొదలైంది. ఇవన్నీ జరుగటమంటే ఇక సీమాంధ్ర ధనిక వర్గాల తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఆధారాలు లేకుండాపోవటన్నమాట. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పెరిగినా కొద్దీ ఈ పరివర్తన స్పష్టమైన స్వరూప స్వభావాలను సంతరించుకుంది. అనగా, తర్వాతి కాలంలో టీడీపీ సహజ మరణానికి ఆ విధంగా బీజాలు పడటమన్న మాట. ఇది 2000వ సంవత్సరం తర్వాత కొద్దికాలానికి మొదలైంది. ఉద్యమం విస్తరించిన కొద్దీ ఆ బీజాలు మొలకెత్తి మొక్కలుగా ఎదుగుతూ, 2009లో కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటన సమయానికి పరాకాష్టకు చేరింది. 2009-14 మధ్య జరిగింది చివరి అంకం. 2014లో రాష్ట్రం ఏర్పాటునుంచి ఆ పార్టీ ఇక తిరుగులేనివిధంగా మరణశయ్యపైకి చేరింది. వీటన్నిటి తర్వాత ఇక్కడ ఆ పార్టీ మనుగడకు ఆస్కారమే లేదు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మనం చూస్తున్నది టీడీపీ అంత్యక్రియల చివరి ఘట్టం.

2014 ఎన్నికల్లో వెనుకటి అవశేషపు అంశాలు మిగిలి ఉండినందున 15 స్థానాలు తెచ్చుకోగలిగారు. ఆ సభ్యులు తెలంగాణ కొత్త వాస్తవాలను గుర్తించి క్రమంగా పార్టీకి దూరమయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాలుగేండ్ల కాలంలోనే వివిధ ఎన్నికలు, ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు, ఇతర పార్టీలతో కలగలసి పోటీచేసిన సందర్భాల్లోనూ ఉపయోగం లేని వైనం, చట్టసభల సభ్యులు కాని నాయకులతో పాటు దిగువ శ్రేణులవారు, కార్యకర్తలు పార్టీని వీడటం వంటివన్నీ మనం చూశాం. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఆ పార్టీకి ఒంటరిగా పోటీచేసే ధైర్యం లేకపోయింది. ఇతరులతో పొత్తు ద్వారా దక్కినవి కూడా కేవలం 15 కాగా అందుకు సమాధానపడవలసి వచ్చింది. పోటీ చేసినవాటిలో గెలిచివని రెండే కాగా, అవి కూడా ఖమ్మం వంటి ప్రత్యేక జిల్లా నుంచి కాగా, అనేక చోట్ల డిపాజిట్లు కోల్పోయారు. ఈ దయనీయ స్థితి చాలదన్నట్లు, గెలిచిన ఇద్దరిలో ఒకరు పార్టీ నుంచి వెళ్లిపోయారు. అసెంబ్లీ పర్వం ముగిసి లోక్‌సభ ఎన్నికలు వచ్చేసరికి, ఈ మూడు మాసాల కాలంలో టీడీపీ తక్కిన కూటమి పార్టీలన్నింటికీ కనీసం అంటరానిదిగా మారింది. కాంగ్రెస్ నుంచి పొత్తుమాట కాదుగదా అసలు సంప్రదింపులు లేకపోయాయి. తక్కినవారందరికి కూడా ఈ పార్టీ ఒక అక్రమ సంబంధంగా తోచి భయపడ్డారు. పొత్తులు, సీట్లు అక్కరలేదు కనీసం మా మద్దతు అడగండి ఇస్తామన్నా, అలా అడిగేందుకు ఎవరూ సాహసించలేదు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా అందరికీ కలిసి ఒక జనరల్ అప్పీల్ మాత్రం చేశారు.

నిజం చెప్పాలంటే ఇది ఒక పరాభవకరమైన స్థితి. కానీ చేయగలిగింది లేదు. తాము పోటీ చేయబోవటం లేదని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ సోమవారం నాడు ప్రకటించటంతో పార్టీకి రాజకీయ మరణ క్రతువు ముగిసింది. రమణ, ఆయన బృందం మాట తెలియదుగాని, ఈ పరిణామ క్రమానికి చివరన ఇదొక అనివార్యమైన సహజ మరణమన్నది మనందరికీ అర్థమవుతున్న విషయమే. ఇది సంతాపాలు అక్కరలేని మరణం.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..


Connect with us

Videos

MORE

Telugu

MORE

Featured

MORE