తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి దేశవ్యాప్తంగా ప్రశంశలు దక్కుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో పర్యటించిన తమిళనాడు ఇంజనీర్ల బృందం అద్భుతమని కొనియాడారు. ఇంజినీర్ల గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కోమటిబండ మిషన్ భగీరథ ప్రాజెక్టును తమిళనాడుకు చెందిన 25 మంది వాటర్ రిసోర్స్ ఇంజనీర్లు సందర్శించారు. గోదావరి నది నుంచి నీటిని కోమటిబండకు వరకు తీసుకొచ్చిన విధానం, గ్రామాల్లోని ప్రతి ఇంటికి రెండు విడతలుగా నీటి సరఫరా, శుద్ధిచేసే పద్ధతులను మిషన్ భగీరథ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోమటిబండ వద్ద నిర్మించిన ట్యాంకు ద్వారా వివిధ సెగ్మెంట్లకు నీరు సరఫరా చేస్తున్నట్టు అధికారులు వారికి తెలియాజేశారు. ఈ ప్రాజెక్టును పరిశీలించిన బృందం సభ్యులు… తక్కువ సమయంలో, ఈ విధంగా ప్రతీ గ్రామానికి, ప్రతీ ఇంటికి మంచినీరు అందజేసిన పథకం దేశంలో మరెక్కడా లేదని అన్నారు.

