తమిళనాడులో ‘కల్యాణలక్షి’… తెలంగాణ పథకం ప్రేరణ

  • January 14, 2022 2:49 pm

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సామాన్య ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలు విజయవంతం అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలను దేశంలోని అనేక రాష్ట్రాలు వివిధ రూపాల్లో అనుకరించాయి. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ భగీరథ’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ‘హర్ ఘర్ జల్ యోజన’ పేరుతో తీసుకువచ్చింది. అంతేకాకుండా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, సీఎం కేసీఆర్ కలల రూపం అయినటువంటి ‘రైతుబంధు’ పథకాన్ని కూడా కేంద్రం ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టింది. తాజాగా ఈ జాబితాలో ‘కల్యాణలక్ష్మి’ కూడా వచ్చి చేరింది. పేదింటి ఆడబిడ్డల పెళ్లికోసం తల్లిదండ్రులు అప్పులపాలు కాకుండా మేనమామగా బాధ్యత స్వీకరించిన సీఎం కేసీఆర్‌… ‘కల్యాణలక్ష్మి’ పేరిట ఓ బహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆడబిడ్డకు పెండ్లి చేసే కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ప్రభుత్వం తరపున లక్షా నూట పదహారు రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు. తెలంగాణ ‘కల్యాణలక్ష్మి’ పథకం ప్రేరణతో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ కూడా గురువారం ఆడబిడ్డల పెండ్లిళ్ల పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా బిడ్డ పెండ్లి చేసే వధువు కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటుగా 8 గ్రాముల బంగారు కాసు అందజేయనున్నారు. ఈ పథకంలో భాగంగా 94,700 మంది అమ్మాయిల వివాహానికి రూ.762 కోట్లు కేటాయించింది తమిళనాడు ప్రభుత్వం. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతీ పథకం, ఖర్చు పెట్టె ప్రతీ రూపాయి రాష్ట్రంలోని సామాన్యునికి లబ్ది చేకూరేది అయ్యి ఉండాలనే కేసీఆర్ తపనను ఇపుడు దేశం మొత్తం స్ఫూర్తిగా తీసుకుంటుంది అనడానికి ఇదే నిదర్శనం.


Connect with us

Videos

MORE