mt_logo

ధిక్కార గడ్దమీద దీనులై, పరాధీనులై

ఫొటో: కిరణ్ కుమార్ రెడ్డి కాళ్లు పట్టుకుని తరాజులో కూర్చోబెడుతున్న పొన్నాల లక్ష్మయ్య

ఫొటో: ముఖ్యమంత్రి ముందు మోకరిల్లిన కాంగ్రెస్ నేతలు

ఇదే అదను. జోకండీ..
పోటీలు పడి జోకండి.
సకులంముకలం భాష అర్థం కాని ముఖ్యమంత్రి.
కాళ్లుపట్టి కూర్చోబెట్టిన మంత్రి.
అక్కడే చిన్నపిల్లాడై కూర్చున్న అదే మంత్రి.
ఆయన కూర్చున్నాడు కదా నేనెక్కడ వెనుకబడిపోతానో అని మరో మంత్రి.
మంత్రులే మోకరిల్లారు కదా అని మరో మాజీ మంత్రి. ఆయనను చూసి మాజీ ఎమ్మె ల్యే. ఒకరిని చూసి ఒకరు.
అంతా మోకాళ్లపై ముఖ్యమంత్రి ముందు వాలిపోయారు.

సమ్మక్క ఎటువంటి పౌరుషం? కాకతీయ సామ్రాజ్యాన్ని ముచ్చెమటలు పెట్టించిన కత్తిమెరుపు సమ్మక్క. ఆదివాసీ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం పో రాడి ఎదురించి.. ఓడిపోయి కూడా గెలిచిన వీరవనిత. అటువంటి ధిక్కార నేల మీద.. అదీ ఆత్మగౌరవం కోసం నాలుగున్నర కోట్ల మంది దశాబ్దాలుగా సమ్మక్క స్ఫూర్తితో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న ప్రత్యేక సందర్భం. అటువంటి సందర్భంలో మన నేతలు సీఎం ముందు సాగిలపడటాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పటికప్పుడు సమయానుకూలంగా అనివార్యంగా ఎదురైన సందర్భమే కావచ్చు కానీ వారు ఇలా చేయాల్సింది కాదు అనే అభిప్రాయం వ్యక్తమైంది. వాళ్ల విపరీత ప్రవర్తనకు భక్తులేకాదు కాంగ్రెస్ శ్రేణులు చిన్నబుచ్చుకున్నాయి. ముఖ్యమంత్రి మేడారం పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై యావత్ తెలంగాణ సమాజం అభ్యంతరం చెబుతోంది. నేతల సరళిపై అసహనం వ్యక్తం అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది?

తులాభారం సమయంలో..

ముఖ్యమంత్రి బుధవారం మేడారం సమ్మక్క -సారలమ్మ జాతరకు విచ్చేశారు. ఆయన రాకకో సం పోలీసులు అసాధారణ భద్రతా ఏర్పాట్లను చేశారు. ఎవ్వరినీ లోనికి అనుమతించలేదు. మీడియాపైనా ఆంక్షలు పెట్టారు. సీఎం కిరణ్‌కుమార్‌డ్డి అనుకున్న సమాయానికే మేడారంలో వాలిపోయారు. ఆయన వచ్చి రాగానే మర్యాదపూర్వంగా మంత్రులు ఎమ్మెల్యేలు, ఇతర కాంగ్రెస్ నాయకులు ఆయనకు పోటీపడి ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన దేవాదాయశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక తులాభారం దగ్గరికి సీఎంను తోడ్కొని పోయారు. ముఖ్యమంత్రి తన బరువు ఎంతో జోక్కునేందుకు తరాజు దగ్గరికి వచ్చా రు. ఆయన జోకిచ్చుకునేందుకు అందులో కూర్చున్నారు.

మంత్రులు, ఎంపీలు, నాయకులు పోటీపడి ఆయన చుట్టూ చేరిపోయారు. ఆయనకు తరాజు (తాసు)లో కూర్చోవడం సరిగా రాలే దు. ఆయన రెండు కాళ్లను నేలమీదే ఉంచారు. ఇంతలో ‘అట్లాకాదు సార్..సకులం ముకులం పె ట్టుకోండీ’ అంటూ కొంతమంది ఆయనకు చెప్పే ప్రయత్నం చేశారు. ఆయనకు అర్ధం కాలేదు. వెంటనే తేరుకున్న జిల్లా మంత్రి పొన్నాల లక్ష్మయ్య సీఎం కాళ్లుపట్టుకుని చిన్నపిల్లాడికి చెప్పినట్లు చెప్పడమే కాకుండా ఆయనను తరాజులో కూర్చొబెట్టారు. అంతటితో ఆగకుండా ఆయన కాంట (తరాజు) మధ్యలో అట్లేనేల మీదే కూర్చుండిపోయారు. ఇది గమనించిన మరో జిల్లా మంత్రి బస్వరాజు సారయ్య తానెక్కడ వెనుకబడిపోతానోనని ఆయనా మోకాళ్ల మీద కూర్చున్నారు. ఇద్దరు మంత్రులు కూర్చున్నారని పసిగట్టిన మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్ సైతం మోకాళ్ల మీద కూ ర్చున్నారు. వీరంతా కూర్చున్నారని మాజీ ఎమ్మె ల్యే పొదెం వీరయ్యా కూర్చున్నారు.

వీళ్లలో ఒకరు ఎమ్మెల్యే, సినీనటుడు చిరంజీవి చేయిపట్టుకుని కూర్చొమన్నట్టుగా సైగ చేస్తే ‘చిరు’సన్నటి నవ్వుతో తోసిపుచ్చారు. ఈ చర్య అంతా క్షణాల్లో జరిగిపోయింది. అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ‘మనవాళ్లేంది గీ జోకుడేంది..(జోకడమంటే వేరే అర్థంలోకాదు బరువును తూచడం అనే అర్థంలో నే..) గాయిన ముందు వీళ్లెంత వీళ్ల రాజకీయ అనుభవం ఎంత..?’ అని ముక్కున వేలేసుకోవడం, గుసగుసలాడుకోవడం ఈసారి ముఖ్యమంత్రి మేడారం ‘మొక్కు’బడి కార్యక్షికమంలో చోటుచేసుకున్న పరిణామాలు. [నమస్తే తెలంగాణ నుండి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *