పర్యాటక కేంద్రంగా పీవీ జన్మస్థలం..

  • September 12, 2020 2:41 pm

మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు జన్మించిన నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామాన్ని రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పీవీ స్మారక మందిరాన్ని పరిశీలించారు. పర్యాటక కేంద్రంగా లక్నెపల్లిని అభివృద్ధి చేసే ప్రతిపాదనలపై గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరిత, టూరిజం ఎండీ మనోహర్, ఇతర అధికారులు, స్థానిక నేతలు తదితరులు ఉన్నారు.


Connect with us

Videos

MORE