mt_logo

సింగరేణి సీఎండీని కలిసిన పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్

పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, మరికొందరు ఎమ్మెల్యేలు ఈరోజు సింగరేణి సీఎండీని కలిసి సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు రూ. 100 కోట్ల వాటాను దీపావళికి ఇవ్వాలని, దసరాకిచ్చే అడ్వాన్సును పెంచాలని సీఎండీని కోరినట్లు మీడియాకు సుమన్ వివరించారు. తాము చేసిన విజ్ఞప్తికి సీఎండీ సానుకూలంగా స్పందించినట్లు, సీఎం కేసీఆర్ తో ఈ విషయంపై చర్చిస్తానని హామీ ఇచ్చినట్లు బాల్క సుమన్ తెలిపారు.

శాసనసభా పక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై ఎంపీ బాల్క సుమన్ తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి టీడీపీ నేతల చెప్పుచేతల్లో పావుగా మారారని, అభివృద్ధిని అడ్డుకోవడానికే డ్రామాలు ఆడుతున్నారని, ఇక డ్రామాలు ఆపకపోతే బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బానిస బతుకును వదిలేస్తే బాగుంటుందని, మెట్రోపై ఉద్దేశపూర్వకంగానే మాట్లాడుతున్నారని, రేవంత్ రెడ్డి ఆంధ్రనేతల దగ్గర బ్లాక్ మెయిల్ రాజకీయాలు నేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బ్లాక్ మెయిల్ రాజకీయాలతో ప్రభుత్వ పెద్దలను, పారిశ్రామిక వేత్తలను బెదిరించడం సరైన పద్దతి కాదని సుమన్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి రాయదుర్గం భూములకు ఏం సంబంధమని, త్వరలోనే సమాచార హక్కు చట్టం కింద పూర్తి సమాచారాన్ని సేకరించి రహస్యాన్ని బహిర్గతం చేస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *