mt_logo

ఈనెల 27 న అమెరికాలో గ్రేటర్ సిన్సినాటి బతుకమ్మ సంబరాలు

అమెరికాలోని గ్రేటర్ సిన్సినాటి తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27 న బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. స్థానిక పైన్ హిల్ లేక్స్ పార్క్ లో మధ్యాహ్నం 2 గంటల నుండి 6 గంటల వరకు జరిగే ఈ వేడుకకు అందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు తెలిపారు.

ఓహిలోని మాసన్ సిటీ వేదికగా జరిగే ఈ పండుగకు గాయని సంధ్యక్క ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు, కార్యక్రమానికి హాజరయిన మహిళలకు బతుకమ్మల పోటీ ఉంటుందని, అందమైన బతుకమ్మకు జీసీటీఏ ట్రోఫీ అందజేస్తామని, పూర్తి వివరాలకు జీసీటీఏ పేస్ బుక్ పేజీని (www.facebook.com/gctabook)చూడవచ్చని నిర్వాహకులు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *