తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో 21 అక్టోబర్ 2012 నాడు స్థానిక బాటిల్ ట్రీ పార్కులో బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 600 మంది తెలంగాణ పౌరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలను బతుకమ్మ పండుగ ఒక్కటి చేసిందని అన్నారు.
సింగపూర్ లో స్థానికంగా లభ్యమయ్యే పూలతో అలంకరించిన బతుకమ్మలు ఆ ప్రాంతానికే కొత్త శోభను తెచ్చినయి.