మొదలై ఇంకా రెండు వారాలు కాకముందే సీమాంధ్రలో విద్యార్ది ఉద్యమం చీలికలు పేలికలయ్యింది. విద్యార్ధి నాయకుల మధ్య ఉన్న పరస్పర విభేధాలు తారాస్థాయికి చేరాయి. ఒకరిమీద ఒకరికి నమ్మకాలు లేకపోవడం, ఎవరికి వారే వ్యక్తిగత లబ్ది కొరకు ఉద్యమంలో పాలుపంచుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
కొంతకాలం కింద సీమాంధ్రలోని కొన్ని విద్యార్ధి సంఘాలు ఒక జాయింట్ ఆక్షన్ కమిటీగా ఏర్పడినట్టు ప్రకటించారు. అయితే ఇప్పటిదాకా పెద్దగా ప్రభావం చూపే ఉద్యమరూపాలు ఏవీ సీమాంధ్ర విద్యార్ధి జేయేసీ చేయలేకపోయింది.
స్వంతంగా ఒక్క కార్యక్రమం కూడా చేయలేకపోగా, తెలంగాణ ఉద్యమాన్ని కాపీకొట్టి కార్యక్రమాలు ప్రకటించడమే సరిపోతుంది. పైగా అర్భాటంగా ప్రకటించిన అనేక కార్యక్రమాల్లో ఒక్కటికూడా అమలుచేయలేక గుడ్లుతేలేస్తున్నారు. సమైక్యాంధ్ర పేరిట కొందరు నేతలు చేస్తున్న హంగామా మొత్తం వచ్చే ఎన్నికల్లో లబ్దికొరకే అని సీమాంధ్ర లో అత్యధిక విద్యార్ధులు భావిస్తుండటంతో వారు ఆందోళనలకు పెద్దగా మొగ్గుచూపడం లేదు.
ఆఖరికి ఆంధ్రా యూనివర్సిటీ గేటు ముందు నిర్వహించే ఆందోళనల్లో కూడా పట్టుమని పదిమంది లేకపోవడం సీమాంధ్రలో విద్యార్ధి ఉద్యమం దుస్థితిని తెలియజేస్తుంది.